ACB DA case | మైన్స్ ఏడీ జయరాజ్​కు 14 రోజుల రిమాండ్​

అక్రమాస్తుల కేసులో మైన్స్​ ఏడీ జయరాజ్​కు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను వరంగల్​ జైలుకు తరలించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB DA case | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్​ ఏడీ జయరాజ్ (AD Jayraj) ఇళ్లలో గురువారం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారీగా అక్రమాస్తులను గుర్తించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం ఏడీ జయరాజ్​ను ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశ పెట్టారు.

ACB DA case | వరంగల్​ జైలుకు తరలింపు

జయరాజ్ భారీగా అవినీతి సొమ్ము కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారం, నగదు, ఫ్లాట్లు, భూములు, కార్లు, బ్యాంకు డిపాజిట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. జయరాజ్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వరంగల్ జైలు (Warangal Jail)కు నిందితుడిని తరలించారు.

ACB DA case | ఆస్తుల చిట్టా

ఏడీ జయరాజ్​కు ఒక జీ+2 భవనం, కేపీహెచ్​బీలో ప్లాటు, ఇతర ప్రాంతాల్లో ఐదు ప్లాట్లు ఉన్నాయి. 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.10,03,640 నగదు, ఎల్​ఐసీ, మాక్స్ లైఫ్ పొదుపు ఖాతాలలో రూ. 19,86,104, పోస్ట్ ఆఫీస్ ఖాతాలో రూ.20,86,175, 629 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు ఖాతాలలో సుమారుగా రూ.71 లక్షల నిల్వలను ఏసీబీ గుర్తించింది. అంతేగాకుండా ఇసుక రవాణా వ్యాపారుల నుంచి ఏడీ భారీగా లంచాలు తీసుకున్నాడు. ఆయన డ్రైవర్​ ద్వారా ఆ డబ్బులను తీసుకొని.. అనంతరం తన కూతురు అకౌంట్​కు బదిలీ చేయించాడు. డ్రైవర్​ నుంచి ఏడీ కూతురి బ్యాంక్​ ఖాతాకు రూ.24 లక్షల లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

దీనిని కూడా చదవండి : Nepal Barrier Lake | నేపాల్‌కు మరో పెను ముప్పు.. బారియర్‌ సరస్సు బద్దలైతే భారీ వరద ముప్పు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *