Konda Surekha Rakhi | సీఎం రేవంత్​రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Konda Surekha Rakhi | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. రాఖీ పండుగను పురస్కరించుకొని ఆయన నివాసానికి వెళ్లిన ఆమె రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

పరకాల వివాదం తర్వాత కొండా సురేఖపై పలువురు కాంగ్రెస్​ నాయకులు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఆమె కూతురు సుష్మిత సీఎం రేవంత్​రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో సురేఖపై చర్యలు తీసుకోవడానికి పార్టీ సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో మంత్రి సురేఖ సీఎం నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి సీతక్క, కొండా సురేఖ సీఎంకు రాఖీ కట్టారు. అనంతరం సురేఖ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Konda Surekha Rakhi | చర్యలపై ఉత్కంఠ

కొండా సుష్మిత వ్యాఖ్యలతో పార్టీలో చాలా మంది నాయకులు సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేస్తున్నారు. ఈ క్రమంలో కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. తాజాగా కొండా సురేఖ సీఎం రేవంత్​రెడ్డికి రాఖీ కట్టారు. ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. చర్యలు తీసుకోకపోతే పార్టీలో క్రమ శిక్షణ దారి తప్పుతుందని, ఇతర నేతలు సైతం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారని పలువురు పేర్కొంటున్నారు.

దీనిని కూడా చదవండి : ACB DA case | మైన్స్ ఏడీ జయరాజ్​కు 14 రోజుల రిమాండ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.