Helmet Awareness Campaign | అన్నా ప్లీజ్.. హెల్మెట్ ధరించండి.. రాఖీ కట్టి పోలీసుల వినూత్న కార్యక్రమం

రాఖీ పండుగ సందర్భాన్ని రోడ్డు భద్రతా అవగాహనకు వేదికగా మలుచుకుని కామారెడ్డి ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Helmet Awareness Campaign | రాఖీ పండుగ సందర్భాన్ని రోడ్డు భద్రతా అవగాహనకు వేదికగా మలుచుకుని కామారెడ్డి (kamareddy) ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జరిమానాలతో భయపెట్టడం కంటే ఆత్మీయతతో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Helmet Awareness Campaign | కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేరకు..

కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్సై (kamareddy Traffic police) చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులను ఆపి, మహిళా ట్రాఫిక్ సిబ్బంది వారికి బొట్టు పెట్టి రాఖీ కట్టారు. ‘అన్నా ప్లీజ్.. మీ ప్రాణం మీ కుటుంబానికి ఎంతో విలువైనది, క్షేమంగా ఇంటికి చేరడం కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి’ అంటూ సూచించారు. చట్ట ప్రకారం చలానా విధిస్తూనే, మానవతా దృక్పథంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన తీరు వాహనదారులను ఆకట్టుకుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ ధారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై వినయ్ సాగర్​తో పాటు మహిళా సిబ్బంది శోభ, స్వప్న, అనిత, సిబ్బంది మూసిన్ ఖాన్, తిరుపతి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: లాస్ట్ 40 మిన్సిట్స్ ఏమోష‌న్ ఇరుముడి కంటే బాగుంటుంది..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *