అక్షరటుడే వెబ్‌డెస్క్: Polavaram Left Canal | అమరావతి సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )పలు కీలక విషయాలపై మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఏదో ఒక విధంగా అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా సంక్షేమం, అభివృద్ధి , ప్రాజెక్టుల పూర్తి దిశగా తమ కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయదని తేల్చిచెప్పారు.
Polavaram Left Canal | మార్కాపురం హార్టీకల్చర్ హబ్..
రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రజల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టమని చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మార్కాపురంను నూతన జిల్లాగా ప్రకటించామని తెలిపారు. ఆ ప్రాంతాన్ని వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు వీలుగా మార్కాపురం జిల్లాను ప్రతిష్టాత్మక హార్టీకల్చర్ హబ్‌లో చేర్చినట్లు వివరించారు.
Polavaram Left Canal | పోలవరం లెఫ్ట్ కెనాల్‌కు జలహారతి..
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీన కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్‌కు అధికారికంగా ‘జలహారతి’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నీటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి పంటలకు సాగునీరు అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్ లక్కీడ్రా ప్రారంభం