అక్షర టుడే, కామారెడ్డి: Poor Bride Wedding Help | పేద కుటుంబానికి చెందిన ఓ పెళ్లికూతురికి పుస్తె మట్టెలు అందజేసి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు ఆయన స్వయంగా హాజరై పుస్తె మట్టెలను అందజేశారు.
మద్దికుంట శివాలయ ప్రాంగణంలో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, ఆడపడుచులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
Revanth Reddy Messi | మీ ప్రయాణం ఓ స్ఫూర్తి : మెస్సీ వీడ్కోలుపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం!
Poor Bride Wedding Help | పేద ఆడపడుచులకు సహకారం
పేద కుటుంబాల ఆడపడుచుల వివాహాలకు తమ వంతు సహకారం అందిస్తూ వారికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కట్ట సప్న దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. పేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన్, డీసీసీ జనరల్ సెక్రటరీ జూలూరి సుధాకర్, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, కోటి, పండు శ్రీకాంత్, శశి, మున్ను, రాహుల్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.