అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Boys Observation Home | బాలురకు సరైన భోజనం అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నీలిమ ముద్దసాని అధికారులను ఆదేశించారు. కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే మంగళవాకం ఆమె (Nizamabad) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పరిశీల వసతి గృహాన్ని తనిఖీ చేశారు.
బాలురకు చట్టాలపై అవగాహన..
నీలిమా ముద్దసాని పరిశీలన గృహంలో (Govt Boys Observation Home, Nzb) విద్యార్థులతో మాట్లాడారు. వారు చేసిన తప్పులను గుర్తుచేసి వాటికి తగు చట్టాలను తెలియ చేశారు. బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని బాలురకు సూచించారు. ఇలాంటి పనులు మళ్లీ చేయవద్దని బాగా చదువుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Single Use Plastic Ban | సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై బల్దియా ఉక్కుపాదం