Kavitha Bodhan Contest | బోధన్​లో కవిత పోటీ చేస్తానంటే స్వాగతిస్తాం: బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​

బోధన్ నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​ :  Kavitha Bodhan Contest | బోధన్ నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

Kavitha Bodhan Contest | కవితపై అపారమైన గౌరవం..

కవితపై తనకు అపారమైన గౌరవం ఉందని షకీల్​ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరైనా కొత్తగా పార్టీలు పెట్టుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయరాదని కవితకు షకీల్ సూచించారు. అలాగే​ వెయ్యి రోజుల కాంగ్రెస్ అసమర్ధ పాలనపై నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఆయన సూచించారు.

Kavitha Bodhan Contest | సుదర్శన్​రెడ్డితో బోధన్​కు ఉపయోగమే లేదు..

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియోజకవర్గానికి దిష్టిబొమ్మలా మారాడని.. ఆయనతో బోధన్ నియోజకవర్గానికి ఎటువంటి ఉపయోగం లేదన్నారు. పక్క నియోజకవర్గానికి నిధులు ఇప్పించే సుదర్శన్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వంగా మారిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను 22ఏ కింద నిషేధిత భూములుగా మార్చారన్నారు. ఒక్క బోధన్ నియోజకవర్గంలోని బోధన్ మున్సిపాలిటీలో 3,500 నివాస గృహాలను కూడా 22–ఏ కిందకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. వీటన్నింటిపై బోధన్ నియోజకవర్గంలో వారం రోజులపాటు ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గిరిధర్ గంగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, ఆయా మండలాల అధ్యక్షులు నర్సయ్య, శ్రీరాములు, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Errapati Srinu | ​పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రపాటి శ్రీను ఎన్నిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *