అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Surekha Comments | మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునేముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న కొండా సురేఖ పలువురు నేతలను కలిసిన విషయం తెలిసిందే. ఆమెపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పదేళ్ల పాటు తానే సీఎం అని చెప్పుకుంటున్నారని ఆమె అన్నారు. దీనిపై మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. పదేళ్లు తానే సీఎం అని చెప్పుకున్నందుకు రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Konda Surekha Comments | మంత్రులపై ఆరోపణలు
తనను రాజీనామా చేయమని ఇప్పటి వరకు చెప్పలేదని సురేఖ తెలిపారు. అయతే బీసీకి ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటికి ఏం సమాధానం చెబుతారు.. ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. అధిష్టానానికి అన్నీ రాతపూర్వకంగా తెలియజేశానన్నారు.
Konda Surekha Comments | సీఎం ఎలా నిర్ణయిస్తారు
తన కూతురు మాట్లాడిన దానికి తనపై చర్యలు తీసుకోవద్దని కొండా సురేఖ అన్నారు. పదేళ్లు సీఎం అంటాడు.. అది క్రమ శిక్షణా చర్యల కిందకు రావా అని ప్రశ్నించారు. తన కూతురిని రెచ్చగొట్టినందుకే విమర్శించిందన్నారు. తదుపరి ఎమ్మెల్యే టికెట్ ఎవరికన్నది రేవంత్ రెడ్డి ఎలా నిర్ణయిస్తారని ఆమె ప్రశ్నించారు. సీఎంకు ఏం హక్కు ఉందని అభ్యర్థిని ప్రకటిస్తారన్నారు. కాగా ఇంతవరకు సీఎంపై నేరుగా విమర్శలు చేయని కొండా సురేఖ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఆమె విషయమై అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడానికి సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో మరోసారి సురేఖ సీఎంపై విమర్శలు చేయడంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి..: Konda Surekha Delhi Visit | అధిష్టానం నుంచి నన్నెవరు పిలవలేదు.. నేనే వచ్చా: కొండా సురేఖ