Kavitha TRS | కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదు..

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదని టీఆర్​ఎస్​ ఆర్మూర్​ నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్​ రెడ్డి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Kavitha TRS | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేది లేదని టీఆర్​ఎస్(TRS Nizamabad)​ పార్టీ ఆర్మూర్​ నియోజకవర్గ అధ్యక్షుడు నవీన్​ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.

Kavitha TRS | ప్రశాంత్​రెడ్డి అక్రమాలు ప్రజలందరికీ తెలుసు..

నవీన్​ రెడ్డి మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి అక్రమాలు ప్రజలందరికీ తెలుసన్నారు. బస్వాపూర్​ క్వారీలో జరిగిన అక్రమాలు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్నారు. ఇన్నాళ్లు ప్రజలను మోసం చేస్తూ వస్తున్న ప్రశాంత్​రెడ్డి ఆటలు ఇక సాగవని పేర్కొన్నారు. జిల్లా నాయకులు దొంత ప్రవీణ్ మాట్లాడుతూ.. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తీరును ఎండగట్టారు. బీఆర్​ఎస్​లో కవిత ఉన్నప్పుడు షకీల్​ ఎన్నో పనులు చేయించుకున్నారన్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

జిల్లా నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. అభివృద్ధి చేస్తామని చెప్పి చేతులెత్తేయడం ఒక్క బీజేపీ ఎంపీ అర్వింద్​కే సాధ్యమన్నారు. మాధవనగర్​ వంతెన పనులు ఆలస్యం కావడంతో ఎంపీ పాత్ర ఉందన్నారు. రూరల్ నాయకుడు నరేష్ మాట్లాడుతూ బాజిరెడ్డి గోవర్ధన్​ ఏం మాట్లాడుతారో ఆయనే తెలియదన్నారు. జిల్లా నాయకులు హద్దుల్లో ఉండి మాట్లాడాలని లేకపోతే వారిని తిరగనివ్వమన్నారు.

ఇది కూడా చదవండి: TGSRTCలో కండక్టర్​ పోస్టులు..!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *