Bigala Ganesh Gupta | కాంగ్రెస్​ నయవంచక పాలనను ఎండగడతాం : మాజీ ఎమ్మెల్యే బిగాల

రాష్ట్రంలో కాంగ్రెస్​ నయవంచక పాలనను ఎండగడతామని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bigala Ganesh Gupta | రాష్ట్రంలో కాంగ్రెస్​ నయవంచక పాలనను ఎండగడతామని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా (Bigala Gupta) అన్నారు. కాంగ్రెస్​ వెయ్యి రోజు పాలనపై ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడారు.

Bigala Ganesh Gupta | 22ఏ నిషేధిత జాబితా పేరుతో..

22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రైవేట్ భూముల యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బిగాల ఆరోపించారు. రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ముఖ్యంగా 22ఏ నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు చేర్చడం వల్ల రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అధికారుల తప్పిదాలకు ప్రజలను బాధ్యులను చేసి, ఇప్పుడు వారు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించడం సరికాదని బిగాల పేర్కొన్నారు.

Bigala Ganesh Gupta | రైతాంగాన్ని బలోపేతం చేసింది కేసీఆర్..

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకెళ్లిందని గణేష్ బిగాల అన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం, వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, దేశ ఆహార భద్రతలో తెలంగాణ రైతులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందాల్సిన రైతు భరోసా, రైతు బీమా, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తూ, ఎరువుల విషయంలో కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. బోధన్ పట్టణంలో దాదాపు 40 శాతం భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు తమ భూములను అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గణేష్ బిగాల తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నుడా ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, గాండ్ల లింగం, నవీద్ ఇక్బాల్, అబ్దుల్ మతీన్, జగత్ రెడ్డి  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Mosquito Fever Outbreak | ఉమ్మడిజిల్లాపై దోమల దండు దాడి.. విషజ్వరాల బారిన పడుతున్న ప్రజలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *