CCTV Hacking Allegations | మా సీసీ కెమెరాలు హ్యాక్​ చేస్తున్నారు.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: CCTV Hacking Allegations | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) బీఆర్​ఎస్​ ముఖ్య నాయకుల ఇళ్లు, కార్యాలయాల వద్ద ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేయిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్​ఎస్​ నాయకుడు మన్నె క్రిశాంక్​ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జైలు (Sangareddy Jail)లో మన్నె క్రిశాంక్‌ను హరీశ్​రావు మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు (IPS Officers) తమ ఫోన్లు, ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు.

CCTV Hacking Allegations | నిఘా పెడుతున్నారు

బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూంలో వాళ్లను పెట్టి బీఆర్ఎస్ నాయకులు మీద నిఘా పెడుతున్నారని హరీశ్​రావు (Harish Rao) ఆరోపించారు. తమ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడుతామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అధికారులు రిటైరైనా వదిలి పెట్టమని హెచ్చరించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రేవంత్ రెడ్డి కాదు కదా ఎవ్వరూ వారిని కాపాడలేరన్నారు.

CCTV Hacking Allegations | ఫేక్​ పోస్టులు పెట్టి…

మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు వాళ్ల మీద కేసు పెట్టకుండా.. క్రిశాంక్ మీద కేసు పెట్టారని హరీశ్​రావు అన్నారు. దొంగతనం చేసిన వాడిని వదిలేసి.. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాడిని లోపల పెట్టినట్లు ఉందని విమర్శించారు. క్రిశాంక్ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని, ఫోన్ తీసుకుపోయి పోలీసులకు ఇస్తే ఎవరైనా నాన్ బెయిలబుల్ కేసు పెడతారా అని కోర్టు కూడా అడిగి, దాన్ని కొట్టేసిందన్నారు.

ఇది కూడా చదవండి..: SSC Results | రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *