అక్షరటుడే వెబ్‌డెస్క్: Uttam Kumar Reddy Comments | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR )పై రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఇరిగేషన్ రంగానికి సంబంధించిన తప్పిదాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మళ్లీ పాదయాత్ర చేస్తాననడంపై మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత కూడా ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ చేసిన తప్పుల వల్లే రాష్ట్రం నేడు ఇబ్బందులు పడుతోందని, ఆయన ఫామ్‌హౌస్‌లోనే ఉండటం మంచిదని సెటైర్లు వేశారు.
“రాష్ట్రంలో నీళ్ల సమస్యకు కేసీఆర్, ఎల్‌నినో అనే రెండే రెండు కారణాలు” అని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా భ్రష్టుపట్టిందని, ప్రాజెక్టుల విషయంలో ఆయన పనితీరు సున్నా అని మండిపడ్డారు.
Uttam Kumar Reddy Comments | ఎస్ఎల్బీసీలపై విమర్శలు..
లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సరిగ్గా కట్టి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదని ఉత్తమ్ పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలించే డిజైన్‌ను మార్చడం కేసీఆర్ చేసిన పెద్ద తప్పిదమని, ఆ మార్పులు చేయకుండా ఉంటే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేదని అన్నారు. ఇక ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించిన ఆయన.. కేసీఆర్‌కు అంతా తానే తెలుసన్న అహంకారం తప్ప గ్రౌండ్లో పనితీరు మాత్రం శూన్యమని దుయ్యబట్టారు.
Uttam Kumar Reddy Comments | బీజేపీతో లాలూచీ ఆరోపణలు..
అసెంబ్లీలో కేసీఆర్ గతంలో బూతులు మాట్లాడినప్పుడు హీరోలా ఫీల్ అయ్యారని, ఇప్పుడు అదే రీతిలో మాట్లాడితే నానా యాగీ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ, ఏపీ మధ్య రాజకీయ భాషను చెడగొట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి లొంగిపోయిందని (సరెండర్ అయిందని) ఎద్దేవా చేసిన ఉత్తమ్.. ఆ పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు.
ఇది కూడా చదవండి: 112 Call Saves Lives | 112 కాల్‌తో తల్లీబిడ్డల ప్రాణాలు సేఫ్