Chalo Hyderabad Mahadharna | 10న ఉద్యోగుల ‘చలో హైదరాబాద్​ మహాధర్నా’ను సక్సెస్​ చేయాలి..

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర ఛైర్మన్​ మారం జగదీశ్వర్​ డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Chalo Hyderabad Mahadharna | దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర ఛైర్మన్​ మారం జగదీశ్వర్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు నగరంలోని టీఎన్జీవోస్​  భవన్​ (TNGOS Bhavan)లో ఉద్యోగులతో మాట్లాడారు.

Chalo Hyderabad Mahadharna | ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న సమస్యలు..

టీజేఈజేఏసీ (TGEJAC) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 ‘చలో హైదరాబాద్ – మహాధర్నా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మారం జగదీశ్వర్​ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. 2వ వేతన సవరణ సంఘం (2nd PRC) అమలు చేయాలని.. 2వ వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే తెప్పించి జూలై 2023 నుంచి 51 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యం (DA) లు ఎటువంటి ఆలస్యం లేకుండా విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు రూ.10,000 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ప్రతి నెలా కనీసం రూ.2,000 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని విన్నవించారు.

Chalo Hyderabad Mahadharna | సీపీఎస్​ను రద్దు చేసి ఓపీఎస్​ను పునరుద్దరించాలి..

ఉద్యోగుల భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఎన్​ఈహెచ్​ఎస్​ (NEHS) ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యోగ సంఘాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఉద్యోగ సంఘాల గుర్తింపును పునరుద్ధరించి ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు.

ఈ సమావేశానికి టీజీఈజేఏసీ రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి, నరసింహారెడ్డి , స్వామి, జిల్లా కన్వీనర్ అలుక కిషన్, కో కన్వీనర్ శంకర్, రమణ్​ రెడ్డి, కో ఛైర్మన్లు రమేష్, అమృత్ కుమార్, కృష్ణారెడ్డి, ప్రవీణ్ కుమార్, ధర్మేందర్, సురేష్, శ్రీనివాస్, నర్సయ్య, పండరీనాథ్, వైస్ ఛైర్మన్లు భాస్కర్, మోహన్, బాలయ్య, హన్మాండ్లు, నేతికుంట శేఖర్, రామ్మోహన్, గంగా కిషన్, అన్వర్, జమీలుల్లా, కిషన్, హనుమంత్ రెడ్డి, శ్రీకాంత్, సంతోష్ రెడ్డి, మాణిక్యం, బీరేందర్ సింగ్, ఫైనాన్స్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, సెక్రటరీ వనమాల సుధాకర్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy Road Accident | రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *