Sabitha Indra Reddy | మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేదు : సబితా ఇంద్రారెడ్డి

మహిళలపై దాడి జరిగితే ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sabitha Indra Reddy | మహిళలపై దాడి జరిగితే ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలుసబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం వారు మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

తాతా మధు వ్యాఖ్యల నేపథ్యంలో స్పీకర్ బాధపడ్డారని తెలుసుకొని కేసీఆర్ (KCR) విచారం వ్యక్తం చేయాలని తమకు చెప్పారని మహిళా నేతలు పేర్కొన్నారు. మంత్రులు అమ్మ గురించి మాట్లాడుతున్నారు.. మరి తాము కూడా మహిళలమే కదా అని ప్రశ్నించారు. పోలీసుల తీరుతో తాము కన్నీరు పెట్టుకున్నా కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క మావి డ్రామాలు అని ఎలా అంటారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

Sabitha Indra Reddy | మాట్లాడే అవకాశం ఇవ్వలేదు

పోలీసుల దాడిలో తమకు గాయాలు అయ్యాయని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అయినా సభలో తాము మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏం జరిగినా ప్రకటన చేసే సంప్రదాయం ఉండేది.. ఇప్పుడు కనీసం స్పందన లేదన్నారు. హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి బాధ్యత వహించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. తాతా మధు గురించి మొత్తం విచారణ చేసిన సీఎంకు మహిళా సభ్యుల గురించి పట్టింపు లేదా అని నిలదీశారు. ఈరోజు మహిళా కానిస్టేబుల్‌కు ఇబ్బంది అయిందని కేసు పెట్టించారని, మరి తమకు అవమానంపై సభలో ఎందుకు చర్చ పెట్టడం లేదన్నారు.

ఇది కూడా చదవండి..: Sridhar Babu Comments | ఎవరి చావునూ కోరుకునే సంస్కృతి మా పార్టీది కాదు: మంత్రి శ్రీధర్ బాబు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *