అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Joint Cheque Power | రాష్ట్రవ్యాప్తంగా ఆయా జీపీల్లో అనుభవజ్ఞలైన పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని.. సర్పంచ్‌తో పాటు జీపీ కార్యదర్శులకు సైతం జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముస్కు సాయరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra)కు జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
Joint Cheque Power | ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ ఉండడంతో..
ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో భాగంగా జీపీల ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ ఉందన్నారు. అయితే ఈ పద్ధతి కారణంగా చాలా జీపీల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయన్నారు. కొన్నిచోట్ల వ్యక్తిగత కారణాలు, స్థానిక సమస్యల కారణంగా చెక్కులపై సంతకాలు చేయడం లేదని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, కార్మికులకు వేతనాలు,ఇతర అత్యవసర పనులకు సంబంధించి చెల్లింపులు నిలిచిపోతున్నాయని తెలిపారు. దీంతో పంచాయతీ పాలనపై ప్రతికూల ప్రభావం పడుతోందని వారన్నారు. దీనికి సంబంధించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సంయుక్తంగా చెక్‌పవర్ ఇవ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Darpalli Suicide Case | ప్రాణంగా ప్రేమించాడు.. అమ్మాయి కోసం అదే ప్రాణం తీసుకున్నాడు..