Assembly Incident | బాధ్యులపై క్రిమినల్​ కేసులు నమోదు చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Incident | శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజు చోటుచేసుకున్న సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీ షర్టులు ధరించి సభకు వచ్చిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్​ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు కేటీఆర్, హరీశ్​రావు సహా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారు. తాజాగా సీఎం మాట్లాడుతూ.. ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Assembly Incident | వారిని వదిలిపెట్టం

స్పీకర్​కు ప్రభుత్వం అండగా నిలబడుతుందని సీఎం పేర్కొన్నారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కొందరు అధికారులపై దాడులు చేయడమే కాకుండా స్పీకర్​ స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు.

Assembly Incident | విచారణకు ఆదేశం

అసెంబ్లీ ఘటనలపై ప్రత్యేక విచారణకు సీఎం రేవంత్‌ ఆదేశించారు. విచారణ అధికారిగా విజయ్‌కుమార్​ను నియమించారు.

దీనిని కూడా చదవండి : DIEO Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఐఈవో

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *