అక్షరటుడే, డిచ్‌పల్లి: Dichpally Road Accident | జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డిచ్‌పల్లి మండల (Dichpalli Mandal) పరిధిలో 44వ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
Dichpally Road Accident | ఆర్మూర్ వైపు వెళ్తున్న..
డిచ్‌పల్లి ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ వైపు వెళ్తున్న డీసీఎం లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న హైవే సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్స్‌లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నిర్మల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. మృతుడు ఉపాధ్యాయుడని, తీవ్రంగా గాయపడిన వ్యక్తి రోదిస్తూ తెలిపినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై డిచ్‌పల్లి ఎస్సై ఆరిఫ్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇది కూడా చదవండి..: Rice Mill Dues | రైస్‌మిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలి.. జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ డిమాండ్!