Future City | ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్​ సిటీ : సీఎం రేవంత్​రెడ్డి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Future City | ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్​ సిటీని నిర్మిస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మే నెలలో ఫ్యూచర్ సిటీ కార్యాలయం ప్రారంభిస్తామన్నారు. ఫ్యూచర్​ సిటీ పోలీస్​ కమిషనరేట్​ భవనానికి మంగళవారం ఆయన భూమిపూజ చేశారు.

ఫ్యూచర్ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సిటీ నిర్మాణం అంత సులభం కాదన్నారు. అందరం కలిసి పనిచేస్తే సాధ్యమవుతుందని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీ కడతామంటే కొందరు ఏడుస్తున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయిన బాధలో వాళ్లున్నారని ఎద్దేవా చేశారు. శుక్రాచార్యుడు ఫామ్‌హౌజ్‌లో పడుకున్నారని, మారీచుడు, సుబాహుడు జనంలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Future City | వారికి న్యాయం చేస్తాం

ఫ్యూచర్ సిటీ విషయంలో కొంతమందికి కష్టం ఉందని సీఎం అన్నారు. సరైన నష్టపరిహారం రాలేదన్న బాధ కొందరి రైతుల్లో (Farmers) ఉందని అంగీకరించారు. వారందరికీ న్యాయం చేసేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. భూములు కోల్పోతున్న వారు డబ్బులు తీసుకుని కొంచెం దూరంలో భూమి కొనుకోవచ్చన్నారు. పేదల విషయంలో అధికారులు మానవీయకోణంలో ఆలోచన చేయాలన్నారు.

Future City | బీఆర్​ఎస్​పై విమర్శలు

సింగపూర్ (Singapore), టోక్యో తరహాలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. జూన్ 2 లోగా డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించి మూడు బుల్లెట్ రైళ్లను తీసుకొస్తామని ప్రకటించారు. కొందరు ఫ్యూచర్​ లేని నాయకుడు ఫ్యూచర్​ సిటీ కడుతారా అని ఏడుస్తున్నారని బీఆర్​ఎస్​ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఏడుస్తుంటే తనకు సంగీతం విన్నట్లు ఉంటుందన్నారు. వారి ఏడుస్తూ ఉన్నా.. తాను పనులు చేసుకుంటూ వెళ్తానని స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : SSC Results | విద్యార్థులకు అలెర్ట్​.. వాట్సాప్​లో పదో తరగతి ఫలితాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *