CURE Act Hyderabad | భవిష్యత్​ కోసమే క్యూర్​ చట్టం : శ్రీధర్​బాబు

భవిష్యత్ అవసరాల కోసమే నూతన ‘క్యూర్‌’ చట్టం తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: CURE Act Hyderabad | భవిష్యత్ అవసరాల కోసమే నూతన ‘క్యూర్‌’ చట్టం తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. 1955 నాటి చట్టం స్థానంలో, 2047 నాటి హైదరాబాద్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన ‘క్యూర్‌’ (CURE) చట్టాన్ని తెచ్చామన్నారు.

మంత్రి శ్రీధర్​బాబు (Minister Sridhar Babu) శనివారం అసెంబ్లీలో మాట్లాడారు. క్యూర్​ చట్టంతో పాటు విపత్తుల నిర్మూలనకు కొత్త చట్టం తెస్తామని తెలిపారు. వరదలు వచ్చాక స్పందించడం కంటే ముందే నగరాలను సిద్ధం చేయాలని అన్నారు. విపత్తు వేళ ప్రతి ప్రభుత్వ శాఖ బాధ్యతలు స్పష్టంగా ఉండేలా కొత్త చట్టంలో ప్రత్యేక నిబంధనలు రూపొందించామన్నారు.

CURE Act Hyderabad | ప్రపంచ స్థాయి నగరంగా..

హైదరాబాద్​ను బ్లూ సిటీ, గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. హైదరాబాద్​ నగరం వేగంగా విస్తరిస్తోందన్నారు. దీంతో రానున్న 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని క్యూర్​ చట్టం తెచ్చామన్నారు. మూసీ నది పునరుజ్జీవం చేపడుతామన్నారు. తొలిదశ పనుల కోసం రూ.7,345.12 కోట్లతో అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. 20 టీఎంసీల గోదావరి జలాలు హైదరాబాద్​కు తెస్తామన్నారు. ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ చట్టం బిల్లును మంత్రి శ్రీధర్​బాబు ప్రవేశ పెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. చిన్నపాటి సాంకేతికపరమైన 400 రకాల నేరాలను.. నేరపూరిత పరిధి నుంచి తొలగించాలని చట్టంలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Gandhi Hospital | గాంధీ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌కు అభినందనలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *