అక్షరటుడే, వెబ్‌డెస్క్: Revanth Reddy Kavitha | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్ మెయిలర్ల సంఘం అధ్యక్షుడని ఆరోపించారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తారనుకుంటే… అసెంబ్లీ ఆవరణలో అధికార, ప్రతిపక్షాలు బాహబాహీకి దిగి తిట్టుకున్నాయని కవిత విమర్శించారు. ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తున్నామన్న ఇంగితం లేకుండా ఓ పక్క బీఆర్ఎస్, మరో పక్క కాంగ్రెస్ ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. అటు బీజేపీ సభ్యులు సగం మంది బీఆర్ఎస్, సగం మంది కాంగ్రెస్ మద్దతిస్తూ విచిత్రమైన పాత్ర పోషించారన్నారు. కానీ ఏ ఒక్కరూ కూడా ప్రజాసమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయలేదన్నారు.
Revanth Reddy Kavitha | కమల్ హాసన్‌లా నటించిన సీఎం
ముఖ్యమంత్రి తానేదో స్వాతిముత్యం అన్నట్లు అసెంబ్లీ ఏకాపాత్రాభినయం చేస్తూ కమల్ హాసన్‌లా నటించారని కవిత ఎద్దేవా చేశారు. తానేదో గొప్ప వ్యక్తిని అని చెప్పుకునేందుకు, తన అడ్వర్జైయిజ్ మెంట్ కు అసెంబ్లీని ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాపాలు కడుక్కోవటానికి, తన క్యారెక్టర్ గొప్పదని చెప్పటానికి తనకు కమీషన్లు ఎందుకు అని ఆయన అంటున్నారన్నారు. తనకు భగవంతుడు అన్ని ఇచ్చారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని కవిత అన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకునేందుకు ఆయనకు ఓ మిత్రమండలిని, భయంకరమైన ఫ్యామిలీని, బోలెడంత మంది అవినీతి మినిస్టర్లను ఇచ్చారని ఎద్దేవా చేశారు. 22ఏ పేరుతో పొంగులేటి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇసుక ద్వారా సీతక్క కమీషన్లు తెచ్చి ఇచ్చేలా వాళ్లకు రాసిచ్చారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: Apollo Hospital Fine | గోల్డెన్ అవర్ వృథా.. అపోలో ఆస్పత్రికి రూ.43 లక్షల ఫైన్