Arya Vaishyas Bhavan | ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి : సీఎం రేవంత్​రెడ్డి

ఉప్పల్ భగాయత్​ నగర్​లో ఆర్యవైశ్య ఆత్మ గౌరవ భవనానికి సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Arya Vaishyas Bhavan | హైదరాబాద్ (Hyderabad) ఉప్పల్ భగాయత్​ నగర్​లో ఆర్యవైశ్య ఆత్మ గౌరవ భవనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలని సూచించారు. ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం ఉన్న వాళ్లని సీఎం అన్నారు.

ఆ సామాజిక వర్గంలో పేదవాళ్లు ఉన్నా.. ఆత్మాభిమానం కోసం జీవించారన్నారు. గ్రామాల్లో ఉండే ఆర్య వైశ్యులు ఎలాంటి ష్యూరిటీ లేకుండా పేదలకు అప్పులు ఇస్తారన్నారు. అన్ని వర్గాల ప్రజలతో వారికి సంబంధాలు ఉంటాయన్నారు. ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కలిసి ఉంటేనే బలం అని సూచించారు. సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. రాజకీయాల్లో వాటా కోసం పోరాడాలని, కలిసి కట్టుగా ఉంటేనే పదవులు వస్తాయని సీఎం అన్నారు.

Arya Vaishyas Bhavan | రోశయ్య విగ్రహం ఏర్పాటు చేశాం

ఆర్యవైశ్య బిడ్డ రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా సమర్థవంతంగా పని చేశారని గుర్తు చేశారు. 16 ఏళ్ల కాంగ్రెస్​ పాలనలో ముఖ్యమంత్రులు మారినా.. ఆర్థిక మంత్రిగా రోశయ్య కొనసాగారన్నారు. ఆయన ప్రతిపైసాను ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేశారన్నారు. హైదరాబాద్​ నగరంలో రోశయ్య విగ్రహం పెట్టామన్నారు. ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగిన మహాత్మ గాంధీ ఆర్యవైశ్య బిడ్డని చెప్పారు. కాంగ్రెస్​లో ఎంతోమంది ఆర్యవైశ్యులు కీలక పదవులు అనుభవించారని గుర్తు చేశారు.

దీనిని కూడా చదవండి : National Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​ విజయవంతం: సీపీ సాయిచైతన్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *