అక్షరటుడే వెబ్‌డెస్క్: Weapons Theft Case | సికింద్రాబాద్‌లోని ( Secunderabad )బొల్లారం ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో కలకలం రేపిన వెపన్స్ థెఫ్ట్ కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవిల్దార్ మల్లేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు సికింద్రాబాద్ కోర్టు అనుమతినిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఎల్లుండి నుంచి పోలీసులు నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ జరపనున్నారు.
Weapons Theft Case | లోతుగా దర్యాప్తు..
ఈ సంచలన కేసులో మల్లేశ్‌తో పాటు మరికొంత మంది అనుమానితులను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఆర్మీ రెజిమెంట్ నుంచి భద్రతను దాటి ఆయుధాలు ఎలా బయటకు వెళ్లాయి? ఈ కుట్ర వెనుక ఏదైనా పెద్ద నేరస్థుల నెట్వర్క్ ఉందా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగనున్నారు. ముఖ్యంగా, దొంగిలించిన ఆయుధాలను మల్లేశ్ ఎవరికి విక్రయించాలని ప్లాన్ చేశాడు? ఎవరికైనా అప్పగించాడా? అనే కోణాలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ విచారణలో మల్లేశ్ చెప్పే సమాచారాన్ని బట్టి, ఆ వివరాలన్నింటినీ రాష్ట్ర పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు నివేదిక రూపంలో సమర్పించనున్నారు.
ఇది కూడా చదవండి: Arya Vaishyas Bhavan | ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండాలి : సీఎం రేవంత్‌రెడ్డి