Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం.. గాంధీ భవన్‌కు మాణిక్‌రావు ఠాక్రే ఎంట్రీ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇన్‌చార్జ్ మార్పుపై జోరుగా చర్చ సాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇన్‌చార్జ్ మార్పుపై జోరుగా చర్చ సాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గాంధీ భవన్‌లో నిర్వహించిన వినాయక పూజా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మాజీ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే  ( Manikrao Thakre )అనూహ్యంగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుత ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం సుమారు 10 నెలల పాటు విదేశాలకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను బాధ్యతల నుంచి తప్పించి, కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్లనున్నట్లు తనకు తెలుసని, అయితే దీనిపై ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది తనకు స్పష్టత లేదని పేర్కొన్నారు.

Telangana Congress | రేసులో సీనియర్ నేతల పేర్లు..

2025 ఫిబ్రవరిలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ రేసులో ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్ సింగ్, శక్తిసింహ్ గోహిల్, అశోక్ గెహ్లాట్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఏమాత్రం అంచనాలకు అందకుండా మాణిక్‌రావు ఠాక్రే నేరుగా గాంధీ భవన్‌లోని పూజా కార్యక్రమానికి హాజరుకావడంతో.. అధిష్టానం మరోసారి ఆయనకే బాధ్యతలు అప్పగిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana Congress | మారనున్న ఇన్‌చార్జ్?

రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా, మరోవైపు నేతల మధ్య సమన్వయ లోపం వంటి సవాళ్లు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ను విజయవంతంగా నడిపించే బాధ్యతను హైకమాండ్ ఎవరికి అప్పగిస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి:  PCC Chief | తలసానిని ప్రతిపక్ష నేత చేయాలి : పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *