Acid Attack | భిక్కనూరులో ఘోరం.. వివాహితపై యాసిడ్​ దాడి.. చికిత్స పొందుతూ మృతి

ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వివాహితపై యాసిడ్​ దాడి జరిగింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Acid Attack | ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వివాహితపై యాసిడ్​ దాడి జరిగింది. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.

Acid Attack | భిక్కనూరుకు చెందిన..

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరుకు (Bhikanoor) చెందిన దివ్యవాణి(32)కి పదేళ్ల క్రితం నిజామాబాద్​కు(Nizamabad) చెందిన అరవింద్​తో వివాహమైంది. కుటుంబ కలహాల కారణంగా గత కొన్ని నెలలుగా ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె భిక్కనూరులోని తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 11న పిల్లలను ఇంట్లో వదిలి బయటకు వెళ్లిన దివ్యవాణి తిరిగి రాలేదు. దాంతో ఆందోళన చెందిన తండ్రి మధు భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.

ఈ క్రమంలో ఆదివారం జంగంపల్లి శివారులో యాసిడ్ గాయాలతో పడి ఉన్న దివ్యవాణిని గుర్తించిన పోలీసులు హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితిని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ స్వయంగా పరిశీలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. తన కూతురిపై అల్లుడు అరవింద్, అతని కుటుంబ సభ్యులే యాసిడ్ పోసి దాడి చేశారని మృతురాలి తండ్రి మధు ఆరోపిస్తున్నారు. యాసిడ్ దాడి ఆత్మహత్యాయత్నమా, హత్యాయత్నమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భిక్కనూరు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ట్రావెల్స్ బస్సు బీభత్సం 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *