Nizamabad Collectorate | కలెక్టరేట్​లో మట్టిగణనాథుడికి భక్తితో పూజలు

వినాయక చవితి సందర్భంగా కలెక్టరేట్​లో మట్టిగణనాథుడిని ప్రతిష్ఠించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Collectorate | వినాయక చవితి సందర్భంగా కలెక్టరేట్​లో మట్టిగణనాథుడిని ప్రతిష్ఠించారు. మంగళవారం అదనపు కలెక్టర్​ భుజంగరావు (Additional Collector Bhujanga Rao) ఆధ్వర్యంలో ఉద్యోగులు పూజలు నిర్వహించారు.

Nizamabad Collectorate | పాల్గొన్న ఉద్యోగులు

గణనాథుడికి ప్రత్యేక పూజల్లో ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్వో గీత పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఈ పూజలో పాల్గొనగా, వేద బ్రాహ్మణులతో సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు జరిపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్​లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. విఘ్నాలు తొలగించే ఆది దేవుడు విఘ్నేశ్వరుని కృపతో అంతటా శాంతి సౌభాగ్యాలు సమకూరాలని అదనపు కలెక్టర్ భుజంగరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Armed Struggle | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *