Rajiv Gandhi Auditorium | రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు నిధులు మంజూరు

నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెల్లడించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Rajiv Gandhi Auditorium | నగరంలోని (Nizamabad) రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali) వెల్లడించారు. మంగళవారం నగరంలో ఆయన పర్యటించారు..

Rajiv Gandhi Auditorium | ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో..

జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మంగళవారం 46 మందికి సీఎం సహాయ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల కోసం నిధులు అందించాలని ఇదివరకు జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా వ్యవహరించిన జూపల్లి కృష్ణారావును కోరామన్నారు. ఈ మేరకు మంత్రి జూపల్లి పర్యాటక శాఖ ద్వారా రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారన్నారు.

అదేవిధంగా ఆర్మూర్ పట్టణంలో గెస్ట్ హౌస్ మరమ్మతులకు, సిద్ధుల గుట్ట కాటేజీ, అతిథి గృహం నిర్మాణాలకు రూ.50 లక్షలు, భీమ్​గల్​ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయం అభివృద్ధికి రూ. 4 కోట్ల చొప్పున జిల్లాకు మొత్తం రూ. 5కోట్ల నిధులు మంజూరు చేశారని షబ్బీర్ అలీ వెల్లడించారు. ఈ నిధుల కోసం తనతో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కృషి చేశారని తెలుపుతూ, ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహేష్ కుమార్​కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నగర మేయర్ ఉమారాణి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నరాల రత్నాకర్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన ఒరాకిల్ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *