తెలంగాణHarish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్..: మాజీ మంత్రి హరీశ్​ రావు

Harish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్..: మాజీ మంత్రి హరీశ్​ రావు

కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేస్తున్నది మరొకటి అని మాజీ మంత్రి హరీశ్​ రావు మండిపడ్డారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Harish Rao | కాంగ్రెస్​ పార్టీ (Congress Party) ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేస్తున్నది మరొకటి అని మాజీ మంత్రి హరీశ్​ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అనేది పెద్ద బోగస్ అని వ్యాఖ్యానించారు.

పంటల కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి లేఖ రాశారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోళ్లు ఎందుకు మొదలుపెట్టలేదని ప్రశ్నించారు.

Harish Rao | రైతులను దోచుకుంటున్నా..

మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో, రెండు కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని హరీశ్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎండల్లో మాడిపోతున్నా ప్రభుత్వానికి సోయి లేదా అని ప్రశ్నించారు. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Government) పట్టవా అని నిలదీశారు. రైతులు 20 రోజులుగా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం పావు వంతు మాత్రమే కొనుగోలు చేసిందని.. మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు.

Harish Rao | శనగ రైతుల పాలిట శనిలా..

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనగ రైతుల (Farmers) పాలిట శనిలా మారాయని మాజీ మంత్రి మండిపడ్డారు. కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేశారని విమర్శించారు. శనగలకు మద్దతు ధర రూ. 5,875 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు మూడు, నాలుగు వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. కనీస మద్దతు ధర రూ. 3371 ఉంటే, ప్రైవేటు వ్యక్తులకు కేవలం రూ. 2500 కే అమ్ముకుంటూ నష్టపోతున్నారన్నారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Giridarshak Recruitment Telangana | మావోయిస్టుల నిర్మూలనకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. గిరిదర్శకుల నియామకం!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...