Kammarpally Police Rescue | డయల్ 112 సమాచారంతో తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కమ్మరపల్లి పోలీసులు!

మ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kammarpally Police Rescue | కమ్మరపల్లి మండలంలో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తిని సురక్షితంగా రెస్క్యూ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Kammarpally Police Rescue | రంగంలోకి దిగి గాలింపు చర్యలు

కమ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి కుటుంబ కలహాల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే డయల్ 112 (Dial 112) ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే కమ్మరపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) సీహెచ్ సతీష్ అప్రమత్తమై.. వెంటనే గాలింపు చేపట్టాలని డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు లింబాద్రి, సురేష్‌లను ఆదేశించారు.

Anant Nag Dadasaheb Phalke | కన్నడ లెజెండ్ అనంత్ నాగ్‌కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు!

స్పందించిన పీసీలు గాలింపు చేపట్టి, కమ్మరపల్లి సమీపంలో ఉన్న ఫ్లడ్ కెనాల్ వద్ద ఆ వ్యక్తిని సురక్షితంగా పట్టుకుని రెస్క్యూ చేశారు.

Kammarpally Police Rescue | కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబానికి అప్పగింత

రెస్క్యూ చేసిన వ్యక్తికి పోలీసులు పోలీస్ స్టేషన్‌లో తగిన రీతిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మనోధైర్యాన్ని అందించి, సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అత్యవసర సమయంలో వేగంగా స్పందించి, ప్రాణాపాయం నుంచి వ్యక్తిని కాపాడిన కమ్మరపల్లి ఎస్సై సతీష్‌తో పాటు పీసీలు లింబాద్రి, సురేష్‌లను పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *