అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజలకు పలు సూచనలు చేశారు.
నిమజ్జన శోభాయాత్రల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. చిన్న విగ్రహాలను బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని సూచించారు. శోభాయాత్ర ప్రారంభించే ముందు వాహన ఫిట్‌నెస్‌ను, డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలన్నారు. వాహనాలున ప్రధాన రహదారులపై పార్క్ చేయద్దని పేర్కొన్నారు.
Ganesh Immersion | ఆ వాహనాలకు దారి ఇవ్వాలి
నిమజ్జన శోభాయాత్ర సమయంలో అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాలని పోలీసులు కోరారు. అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్‌లు, ఇతర అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలిగించవద్దన్నారు. తోటి భక్తులు, ప్రయాణికులు, వాహనదారులపై రంగులు, వాటర్ ప్యాకెట్లు లేదా ఇతర వస్తువులు విసిరి వేయొద్దన్నారు. సెల్ఫీలు, రీల్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేయొద్దని సూచించారు.
దీనిని కూడా చదవండి : Ghanpur Dichpally Road Closure | ఘన్‌పూర్–డిచ్‌పల్లి స్టేషన్ రోడ్డుపై రాకపోకలు బంద్