అక్షరటుడే, ఇందూరు: MLA Dhanpal | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లయినా ప్రత్యేక నిధులు విడుదల కాలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు.
MLA Dhanpal | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌పై..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌పై సీఎం, విద్యాశాఖ మంత్రికి మూడు సార్లు లేఖలు ఇచ్చినా స్పష్టత లేదన్నారు. కళాభారతి, మాధవనగర్ బ్రిడ్జి పనులకు బిల్లులు చెల్లించలేక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారన్నారు. అలాగే నిజామాబాద్ బస్టాండ్ పరిస్థితి మండల కేంద్రం బస్టాండ్లా ఉందని, దీని అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని విమర్శించారు.
MLA Dhanpal | జీజీహెచ్‌పై ఎన్ని సమీక్షలు నిర్వహించినా..
జీజీహెచ్ ఆస్పత్రిపై గతంలో సమీక్షలు జరిగినా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. ప్రధానంగా ఆస్పత్రి మార్చురీలో ఫ్రీజర్లు లేక దుర్వాసన వస్తోందన్నారు. జనరల్ వార్డుల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. 800 మంది విద్యార్థులకు ఒక బాలికల ప్రభుత్వ పాఠశాల (పబ్లిక్ స్కూల్) ఏర్పాటు ప్రతిపాదన చేసినా నిజామాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Police RI | ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఆర్ఐ మృతి.. నివాళులర్పించిన సీపీ