అక్షరటుడే, వెబ్‌డెస్క్: TPCC Chief Mahesh Goud | పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ (Danam Nagender) అనర్హత పిటిషన్‌పై ఆయన స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించారు.
మహేశ్ గౌడ్ శనివారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఉప ఎన్నిక వస్తే ఎవరు పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. మంత్రి పదవులపై నిర్ణయం సీఎం రేవంత్‌రెడ్డిదే అని పేర్కొన్నారు.
TPCC Chief Mahesh Goud | బీఆర్ఎస్ ప్రోత్సహించింది
పార్టీ ఫిరాయింపులను గతంలో బీఆర్ఎస్ ప్రోత్సహించిందని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్‌కు విపక్ష హోదా లేకుండా చేశారని గుర్తు చేశారు. సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. 2014, 2018లోనూ పార్టీ ఫిరాయింపులు జరిగాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో అనేక నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు.బీఆర్ఎస్ గతంలో చేసిన ఫిరాయింపులను ఇప్పుడు ఆ పార్టీ నేతలు మరిచిపోయారని వ్యాఖ్యానించారు. టీఎంసీ, శివసేన, ఎన్సీపీని బీజేపీ చీల్చిందని, మోదీ, అమిత్‌షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. పాత బీజేపీ నేతలకు ఉన్న విలువలు ప్రస్తుత నేతలకు లేవని మహేశ్ గౌడ్ అన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Rain Alert | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన