Telangana Political War | తెలంగాణ రాజకీయాల్లో ముదురుతున్న వార్.. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అత్యవసర భేటీ

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Political War | తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. ఫామ్‌హౌస్‌ల పర్యటనల కేంద్రంగా నడుస్తున్న రాజకీయం రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గడిచిన పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో భారీగా భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వరుస పర్యటనలు చేస్తుండటం గులాబీ శిబిరంలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాలపై వ్యూహాత్మకంగా స్పందించేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ముఖ్యనేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.

Telangana Political War | ఫామ్‌హౌస్ టార్గెట్‌గా ..

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతల భూముల కేటాయింపులు, ఆస్తులపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన తర్వాత కాంగ్రెస్ నేతలు పూర్తిగా దూకుడు పెంచారు. ఇందులో భాగంగా కేటీఆర్, హరీశ్ రావు  ( Harish Rao )ఫామ్‌హౌస్‌లతో పాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌ను సైతం నేరుగా సందర్శించి విమర్శలు గుప్పించారు. ఇలా పార్టీలోని ఫామ్‌హౌస్ లీడర్లనే టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు, పర్యటనలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Telangana Political War | ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు ..

కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టేలా కౌంటర్ ఎటాక్ చేయడానికి బీఆర్‌ఎస్ నాయకులు ఈ సమావేశంలో లోతుగా చర్చిస్తున్నారు. శాసనసభలో తమ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడినందున, సభలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కోల్పోయామని.. ఇకపై నేరుగా ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే, పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు విధించిన అనర్హత వేటు, సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలపై కూడా ఈ భేటీలో మంతనాలు సాగిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ఫామ్‌హౌస్ పర్యటనలు, బీఆర్‌ఎస్ వ్యూహాత్మక ప్రతిఘటనతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఇది కూడా చదవండి: Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. బీఆర్​ఎస్​ నాయకుల అరెస్ట్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *