అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Towers | హైదరాబాద్ (Hyderabad) నగరంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) తెలిపారు. పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి సోమవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలోని పేదలకు, ప్రస్తుతం వారు నివస్తున్న ప్రాంతానికి సమీపంలో ఇళ్లు కేటాయించామన్నారు. పేదలను నగరానికి దూరంగా పంపకుండా ఖరీదైన ప్రాంతాల్లో టవర్స్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
Indiramma Towers | లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్
ఇందిరమ్మ టవర్స్‌లో లబ్ధిదారులకు 17 నుంచి 20 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యానికి, పైరవీలకు తావులేదని స్పష్టం చేశారు. లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి 480 ఇళ్లు మంజూరు చేశామన్నారు. త్వరలో టవర్స్ నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు. నగరంలో మొదటి విడతలో ఇల్లు రాని వారు నిరాశ చెందొద్దన్నారు. రెండు, మూడో విడతల్లో వారికి ఇళ్లు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
దీనిని కూడా చదవండి : Nizamabad ACB Trap | పెన్షన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఉద్యోగులు