Social Welfare Student Incident | సోషల్​ వెల్ఫేర్​లో విద్యార్థిని​ ఘటనపై సర్వత్రా విమర్శలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

కామారెడ్డి డివిజన్ పరిధిలోని ఓ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో విద్యార్థిని కిందపడి గాయాలపాలైన ఘటనలో అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Social Welfare Student Incident | కామారెడ్డి (Kamareddy) డివిజన్ పరిధిలోని ఓ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో విద్యార్థిని కిందపడి గాయాలపాలైన ఘటనలో అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను ‘అక్షరటుడే’ వెలుగులోకి తేవడంతో అధికారుల్లో వణుకు మొదలైంది.

Social Welfare Student Incident | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఆపరేషన్​..

సోషల్​ వెల్ఫేర్​లో విద్యార్థిని కళ్లు తిరిగి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లి తలకు ఆపరేషన్ వరకు వెళ్లిన ఘటనను రెండు రోజులుగా అధికారులు అత్యంత పకడ్బందీగా తొక్కిపెట్టేందుకు ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనను ‘అక్షరటుడే’లో ప్రచురితం కావడంతో సంబంధిత శాఖలో వణుకు మొదలైంది. శనివారం జరిగిన ఘటన బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎలా లీకైందనే టెన్షన్​తో అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు విద్యార్థిని పడిపోయిన విషయంగానీ, నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో తలకు ఆపరేషన్ చేసిన విషయంగానీ జిల్లా కలెక్టర్​కు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా దాచిపెట్టడం వెనుక ఉన్న మతలబు ఏమిటనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

Social Welfare Student Incident | ప్రిన్సిపాల్​ నిర్లక్ష్యమా..?

ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం విచారణలో బయటపడితే ఉద్యోగానికే ఎసరు వస్తుందనే భయంతోనే ఈ గోప్యత పాటించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. హాస్టల్ మెట్లపై నుంచి కళ్లు తిరిగి పడిపోయిన బాలికను బెడ్​పై నుంచి పడిపోయిందని అబద్ధపు ప్రచారం చేసి తప్పించుకోవాలని చూశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాయంత్రమే కళ్లు తిరుగుతున్నాయని బాలిక చెప్పినా పట్టించుకోని సిబ్బంది నిర్లక్ష్యమే ఆమె పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లే వరకు కారణమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బాలిక మాట్లాడలేని స్థితిలో ఉండగా, పూర్తిగా కోలుకుంటే తప్ప అసలు నిజం తెలియదని వైద్యులు చెబుతుండగా, చికిత్సకు పాఠశాల నుంచి రూ.రూపాయి కూడా ఇవ్వలేదని, తామే అప్పు చేసి భరిస్తున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారుల నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు మొదలైన నేపథ్యంలో ఉన్నతాధికారులు నిజాలను నిగ్గుతేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా లేక అనుకోకుండా పడిపోయిందంటూ నివేదికలతో చేతులు దులుపుకుంటారా అనేది వేచి చూడాలి.

ఇది కూడా చదవండి..: Social Welfare School Incident | సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థిని కిందపడి గాయాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *