RIMS Hospital Incident | రిమ్స్​ ఘటనలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

రిమ్స్​ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో మరో పసిపాప మృతి చెందింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: RIMS Hospital Incident | రిమ్స్​ ఆస్పత్రిలో ఏసీ పేలిన ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఆస్పత్రిలోని ఎస్ఎన్‌సీయూ వార్డులో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఏసీ నుంచి పొగలు రావడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

ప్రమాద సమయంలో వార్డులో 27 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు స్థానికంగా మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్​ (Nizamabad) జీజీహెచ్​కు తరలించారు. నిజామాబాద్​లో చికిత్స పొందుతూ మరో పసిపాప ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇప్పటి వరకు ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

RIMS Hospital Incident | కేంద్ర మంత్రి దిగ్భ్రాంతి

ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి జరిగిన ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. అధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యతను నిర్ధారించి, ఏదైనా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఆసుపత్రులలో, ముఖ్యంగా నవజాత శిశు, పిల్లల వార్డులలో ఫైర్​ సేఫ్టీ విషయంలో ఎటువంటి రాజీకి తావులేదన్నారు.

ఇది కూడా చదవండి..: RIMS Hospital Accident | రిమ్స్‌ ఆస్పత్రి ప్రమాదంలో మరో చిన్నారి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *