GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో

మంచిర్యాల జిల్లాలో రూ.80 వేల లంచం తీసుకుంటూ.. ఓ జీపీవో ఏసీబీ అధికారులకు దొరికాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GPO Bribe ACB | మంచిర్యాల జిల్లా (Mancherial District) భీమిని మండలం, పెద్దాపేట గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ పరిపాలనాధికారి (జీపీవో) దుర్గా ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడితో పాటు మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

GPO Bribe ACB | పట్టాపాస్​బుక్​ కోసం..

గ్రామంలోని ఓ వ్యక్తి పేరు మీద భూమి బదిలీని ధృవీకరించడం, పట్టా పాస్‌బుక్‌లను జారీ చేయడం కోసం జీపీవో రూ.1.30 లక్షల లంచం అడిగాడు. అందులో భాగంగా మొదటి విడతగా రూ.80 వేలు, పని పూర్తయిన తర్వాత మిగిలిన రూ. 50 వేలు చెల్లించాలని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి పెద్దాపేట శివార్లలోని వ్యవసాయ క్షేత్రాల సమీపంలో జీపీవో దుర్గా ప్రసాద్​ మంగళవారం రూ.80 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

జీపీవో బిత్తూరుపల్లికి చెందిన పోతు రాజేందర్‌తో కలిసి అక్కడకు వచ్చాడు. లంచం నేరుగా తీసుకోకుండా అతడిని తీసుకోమన్నాడు. ఏసీబీ అధికారులు ఇద్దరిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారిని కరీంనగర్​లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Ramchander Rao Arrest | జడ్చర్లలో ఉద్రిక్తత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *