అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Bike Accident | ఎదురుగా వస్తున్న బైక్ మరో బైక్‌ను ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటన రామారెడ్డి(Ramareddy Police) మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
Kamareddy Bike Accident | రామారెడ్డి మండలం మద్దికుంట..
స్థానికులు, పోలీసుల (Kamareddy ) కథనం ప్రకారం.. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన భార్యాభర్తలు దుంపల బాలమణి(38), దుంపల రాజయ్య(45) కామారెడ్డి నుంచి మద్దికుంటకు వెళ్తున్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీ సమీపంలో రామారెడ్డికి చెందిన రాఘవేంద్ర, నరేందర్ ఇద్దరు ఓ బైకుపై వేగంగా కామారెడ్డి వైపు వస్తున్నారు. మద్దికుంటకు చెందిన భార్యాభర్తలు వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొనడంతో ఇరువురు కింద పడిపోయారు. బాలమణి, రాజయ్యలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానికులు కామారెడ్డి జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భార్యాభర్తలు మృతి చెందారు. రామారెడ్డికి చెందిన ఇద్దరు యువకులకు సైతం గాయాలు కావడంతో జీజీహెచ్‌లో చికిత్స కొనసాగుతోంది. మృతిచెందిన భార్యాభర్తల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.