అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Ganesh Shobhayatra | తొమ్మిది రోజులు పూజలందుకున్న గణనాథులకు నిమజ్జనానికి (Ganesh Immersion) బయలుదేరాయి. జిల్లాకేంద్రంలో (Kamareddy) గురువారం రాత్రి గణేష్ శోభాయాత్రను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి ప్రారంభించారు.
Kamareddy Ganesh Shobhayatra | యువజన సమాఖ్య గణపతి ముందు కదలగా..
యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ గణపతిని ప్రత్యేక వాహనంలో ధర్మశాల వద్దకు తీసుకువచ్చి మొదటి పూజ నిర్వహించారు. గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. శోభాయాత్ర సజావుగా సాగేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీసులు, అధికారులకు సహకరించాలని కోరారు. మరోవైపు పోలీసులు డిజెలకు అనుమతి నిరాకరించడంతో ప్రత్యేకంగా తెప్పించిన డోలక్ చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వాహనాలు రాకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేశారు. రంగురంగుల అలంకరణలో వినాయకులు అలరించాయి.
ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్రను వణికిస్తున్న భారీ వర్షాలు నిరంతరం సమీక్షిస్తున్న ఏపీ సీఎం