Hajipur Tanda Land Rights | గిరిజనుల భూములకు హక్కు పాత్రలు ఇవ్వాలి

హాజీపూర్ తండా భూములకు పట్టా హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షర టుడే, కామారెడ్డి: Hajipur Tanda Land Rights | హాజీపూర్ తండా భూములకు పట్టా హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Hajipur Tanda Land Rights | 70 కుటుంబాలు..

గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీరాం నాయక్ మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మండలం (Yellareddy Mandal) హాజీపూర్ తండాలో 70 కుటుంబాలు గత 60 ఏళ్లుగా సర్వే నంబర్ 66లో 40 ఎకరాలు, 176లో 13 ఎకరాలు, 177లో 40 ఎకరాలు, అదనంగా 40 ఎకరాల పోడు భూమిని సాగు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క గుంట భూమికి కూడా పట్టా ఇవ్వలేదని, అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రెండు విడతలుగా పోడు భూములకు పట్టాలు ఇచ్చినా హాజీపూర్ తండా వాసులకు ఒక్క సెంటు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అటవీ అధికారులు రోజూ తండాలో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కేసులు పెడతామని, జైలుకు పంపుతామని బెదిరిస్తూ పది మంది పేర్లు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. 2005 చట్టం ప్రకారం రెవెన్యూ, అటవీ భూమి అయినా సరే సర్వే చేసి హక్కుపత్రాలు ఇవ్వాలని, గిరిజనులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. వెంటనే సర్వే నిర్వహించి 70 కుటుంబాలకు పట్టా హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. గిరిజన సంఘం జిల్లా నాయకులు వినోద్, ఎంపీటీసీ కిషన్ నాయక్, నరేష్ నాయక్, శంకర్ నాయక్, దేవుల నాయక్, సురేందర్ నాయక్, దేవిసింగ్  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: BJP Corporators Protest | మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *