అక్షరటుడే, కామారెడ్డి: Gold Chain Theft | కామారెడ్డి (Kamareddy) పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన మరవకముందే మరోచోట మహిళ కళ్లలో కారం చల్లి ఐదు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు.
Gold Chain Theft | కల్కినగర్లో..
జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ కాలనీలో సుదర్శన్ ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు చొరబడ్డారు. హాల్లో నిద్రిస్తున్న శోభ అనే మహిళ మెడలోని ఐదు తులాల గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించగా, ఆమె అరిచేందుకు యత్నించడంతో కళ్లలో కారం చల్లారు. అడ్డుకోబోయిన కూతురిని బెదిరించి గొలుసుతో పరారయ్యారు. ఈ ఘటన కాలనీలో కలకలం రేపింది. అంతకుముందు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పాత బస్టాండ్ కొటారిగల్లీలో 70 ఏళ్ల వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బంగారు ఆభరణాల కోసమే హత్య జరిగినట్టు సీఐ నరహరి తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఘటనలు జరగడంతో పట్టణంలో భయాందోళన నెలకొంది. రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: VOAs Loan Irregularities | సమాఖ్య రుణాల్లో చేతివాటం.. వెలుగుచూస్తున్న వీవోఏ అక్రమాలు..