అక్షరటుడే, కామారెడ్డి: Pitlam Police Rescue | డయల్ 112కు వచ్చిన సమాచారానికి పోలీసులు తక్షణమే స్పందించారు. ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసిన వ్యక్తిని కాపాడారు.
Pitlam Police Rescue | పిట్లం పోలీసులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం (Pitlam Police) చిన్నకోడబల్లి గ్రామానికి చెందిన గంగారాం ఓ సమస్యపై మనస్తాపానికి గురై వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయం డయల్ 112 ద్వారా సమాచారం అందిన వెంటనే పిట్లం ఎస్సై ఆంజనేయులు సూచనల మేరకు కానిస్టేబుళ్లు రాజు, మహమ్మద్ నదీమ్ క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి గంగారాంను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ నిర్వహించి, సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ఇబ్బందులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. తక్షణమే స్పందించి ప్రాణం కాపాడటంపై స్థానికులు పిట్లం పోలీసులను అభినందించారు.
ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి IAS దివ్య మిట్టల్..