ACB Raid | ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్​

మొయినాబాద్​ మున్సిపాలిటీ టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్​ గుండు వాణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | రంగారెడ్డి (Rangareddy) జిల్లా మొయినాబాద్​ మున్సిపాలిటీ టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్​ (TPO) గుండు వాణి లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు చిక్కింది. ఓ ఇంటి నిర్మాణం విషయంలో ఆమె లంచం డిమాండ్ చేసింది.

ACB Raid | రూ.75 వేలు తీసుకుంటూ..

టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్​ వాణి మున్సిపాలిటి పరిధిలో ఓ వ్యక్తికి చెందిన నిర్మాణాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించి, దానిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసింది. రూ.75 వేలు ఇస్తే నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోమని హామీ ఇచ్చింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఆమె సీనియర్ అసిస్టెంట్‌ యలమోని సుదర్శన్ ద్వారా ఫిర్యాదిదారుడి నుండి రూ. 75 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

దీనిని కూడా చదవండి : Bheem Reddy Benami Case | మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి ఐటీ శాఖ షాక్..దేశ చరిత్రలోనే మొదటిసారిగా బినామీ యాక్ట్ కింద కేసులు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *