Gandhi Jayanti | బాపూఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం రేవంత్

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gandhi Jayanti | జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌ (Hyderabad)లో ఘనంగా జరిగాయి. లంగర్‌హౌస్‌‌లోని బాపూఘాట్‌లో ప్రముఖులు మహాత్ముడికి నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపూఘాట్‌ను సందర్శించి గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజహరుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్రనాయక్, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితర ఉన్నతాధికారులు కూడా హాజరై బాపూజీకి నివాళులు అర్పించారు.

Gandhi Jayanti | బీజేపీ నేతల నివాళులు..

మహాత్మా గాంధీతో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆ మహనీయులకు ఘనంగా నివాళులర్పించారు. ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ చిలకలగూడలో నిర్వహించిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా చీపురు పట్టి రోడ్లను ఊడుస్తూ పరిసరాలను పరిశుభ్రం చేశారు.

ఇది కూడా చదవండి..: TGSRTC Metro Common Pass | హైదరాబాద్ వాసులకు టీజీఎస్ఆర్టీసీ బంపర్​ ఆఫర్.. ఒకే పాస్‌తో బస్సు, మెట్రో ప్రయాణం!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *