Red Cross Society | రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​గా పోతన్​కర్​ లక్ష్మీనారాయణ

రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​గా పోతన్​కర్​ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Red Cross Society | రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​గా పోతన్​కర్​ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, డీసీవో శ్రీనివాస్​ పాలకవర్గంతో సోమవారం రెడ్​క్రాస్ సొసైటీ లో ప్రమాణస్వీకారం చేయించారు.

Red Cross Society | కార్యవర్గమిదే..

రెడ్​క్రాస్​ వైస్​ ఛైర్మన్​గా డాక్టర్​ సీనునాయక్​, ట్రెజరర్​గా కెంపుల నాగరాజు, స్టేట్​ ఎగ్జిక్యూటివ్​ మెంబర్​గా జెస్సు అనిల్​ ఎన్నికయ్యారు. మొత్తంగా 15మందితో సొసైటీ పాలవకర్గం ఏర్పడింది. నగరంలోని హరిచరణ్​ మార్వాడీ విద్యాలయం (Haricharan Marwari School)లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. 29 మంది అభ్యర్థులు రెండు ప్యానెళ్లుగా విడిపోయి పోటీ చేశారు. బుస్సా ఆంజనేయులు ప్యానెల్​లో 14మంది పోటీపడగా నలుగురు విజేతలుగా నిలిచారు. అలాగే ఇందూరు సేవాసమితి ప్యానెల్​లో 15మంది పోటీలో ఉండగా 11మంది గెలిచారు.

ఇది కూడా చదవండి: Tallarampur VDC Action | తాళ్లరాంపూర్​ వీడీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలి..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *