నిజామాబాద్Rural Health Development | గ్రామాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే మదన్​ మోహన్

Rural Health Development | గ్రామాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే మదన్​ మోహన్

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్​ మోహన్ పేర్కొన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో రూ.25లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్​ను ప్రారంభించారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: ​Rural Health Development | గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మదన్​ మోహన్(MLA Madan Mohan ) పేర్కొన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో(Yellareddy) రూ.25లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్​ను(Health Sub-centre) గురువారం ఆయన ప్రారంభించారు.

Rural Health Development | ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత..

ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హెల్త్ సెంటర్​ మరింత అభివృద్ధికి చేసేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి అదనంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ హెల్త్ సెంటర్ ప్రారంభంతో గ్రామంలోనే ప్రాథమిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. గర్భిణులు, వృద్ధులు, పిల్లలకు సబ్​సెంటర్​ ఎంతో ఉపయుక్తంగా మారనుందన్నారు.

Rural Health Development | తాగునీటి సమస్యలకు పరిష్కారం..

అడ్లూర్ ఎల్లారెడ్డి(Adlur Yellareddy) గ్రామంలోని బీసీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రెండు బోర్లు తవ్వించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో ఉన్న పాత ఐరన్ విద్యుత్ స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేయగా, సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

11 4

ఇది కూడా చదవండి: Telangana Advisors | ‘సలహాదారుల’తో ఖజానాకు భారం.. అప్పుల రాష్ట్రంలో అదనపు ఖర్చు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

TNGOs President Election | టీఎన్జీవోస్​ నిజామాబాద్​ అధ్యక్షుడిగా నాశెట్టి సుమన్​ కుమార్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: TNGOs President Election | టీఎన్జీవోస్​ నిజామాబాద్...

AI awareness | ఏఐ నేర్చుకోకుంటే వెనుకబడతారు.. మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AI awareness | మారుతున్న కాలానికి అనుగుణంగా...

Municipal Commissioner Visit | డివిజన్లలో మున్సిపల్​ కమిషనర్​ పర్యటన.. సమస్యలపై ఆరా..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Municipal Commissioner Visit | నగర పాలక...

Kamareddy Heat Wave | ‘రెడ్ జోన్’లో కామారెడ్డి జిల్లా.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Heat Wave | కామారెడ్డి (kamareddy) జిల్లాలో...