Balkonda Police Allegations | బాల్కొండ పోలీసులు తీరు మార్చుకోవాలి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్​ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Balkonda Police Allegations | భీమ్‌గల్ (Bheemgal) పోలీస్‌స్టేషన్ ఆవరణలో టీస్టాల్​ యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి (MLa Prashanth reddy) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మాట్లాడారు.

Balkonda Police Allegations | ఇసుక వ్యాపారులతో ఎస్సై కుమ్మక్కు

స్థానిక ఎస్సై వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేయడం విచారకరమని ప్రశాంత్​రెడ్డి అన్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సుధాకర్‌కు ప్రభుత్వం పూర్తి ఖర్చులతో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. భీమ్‌గల్ ఎస్సై ఇసుక వ్యాపారులతో కుమ్మక్కై భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేయడం ఆయనకు పరిపాటిగా మారిందని వేముల అన్నారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని భీమ్‌గల్ ఎస్సైతో పాటు బాల్కొండ, మోర్తాడ్ ఎస్సైలు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. నిరుపేదలను, దళిత వర్గాల వారిని అకారణంగా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బాల్కొండ నియోజకవర్గంలో ముగ్గురు ఎస్సైల అక్రమాలు, దౌర్జన్యాలు, వేధింపుల వ్యవహారంపై గతంలోనే సీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ఇది కూడా చదవండి: వరుస నష్టాలకు బ్రేకులు.. లాభాలతో ముగిసిన సూచీలు 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *