అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | నిర్మల్ (Nirmal) జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సెక్షన్ ఆఫీసర్ (Forest Section Officer) ఐండ్ల రవీందర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు.
సెక్షన్ పరిధిలో ఓ వ్యక్తికి చెందిన టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ కోసం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్ రూ.12 వేల లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే లైసెన్స్ పునరుద్ధరణ కోసం తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు పంపి, అధికారికంగా సహాయం చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి సెక్షన్ ఆఫీసర్ రవీందర్ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. అతడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచించారు. ఎంత మొత్తం అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోస్తే అవినీతి అధికారుల ఆట కట్టిస్తామన్నారు. లంచం ఇస్తే తమ పనులు చేయకుండా అధికారులు వేధిస్తారనే భయం వద్దన్నారు. ఆ పని పూర్తయ్యే వరకు ఏసీబీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
దీనిని కూడా చదవండి : BMW Employee Gifts | ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్.. యజమానిపై నెటిజన్ల ప్రశంసలు