Hyderabad Kidnap Case | హైదరాబాద్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్

గాజులరామారంలో అశోక్‌ రెడ్డిని అపహరించిన దుండగులు.. భార్యకు సమాచారం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Kidnap Case | హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో వ్యాపారవేత్త అశోక్‌ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్‌ చేసిన ఘటన కలకలం రేపింది. అశోక్‌ రెడ్డిని అపహరించిన అనంతరం కిడ్నాపర్లు ఈ విషయాన్ని ఆయన భార్యకు తెలియజేసినట్లు సమాచారం.

Hyderabad Kidnap Case | భాగస్వామితో విభేదాలు..

అశోక్‌ రెడ్డికి వ్యాపార భాగస్వామి చంద్రశేఖర్‌తో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యాపార విభేదాల నేపథ్యంలోనే కిడ్నాప్‌ జరిగి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

భర్త కిడ్నాప్‌ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దుండగుల ఆచూకీ, అశోక్‌ రెడ్డి ఎక్కడ ఉన్నారనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *