అక్షరటుడే,నిజామాబాద్ క్రైం: Nizamabad Fire Accident | నగరంలో (Nizamabad) విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోగా గాయపడ్డ తండ్రీకొడుకులు ఇద్దరు మృతి చెందారు.
Nizamabad Fire Accident | పూలాంగ్ సమీపంలోని హనుమాన్ నగర్లో..
నగరంలోని పూలాంగ్ సమీపంలోని హనుమాన్ నగరంలో గతనెల 26న తెల్లవారజామున ఫజల్‌ఖాన్ ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ఈ క్రమంలో తండ్రి ఫజల్‌ఖాన్, కొడుకు షాజ్ఖాన్ ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. ఫజల్‌ఖాన్ చికిత్స పొందుతూ మరణించగా.. షాజ్ఖాన్ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందారు. అగ్నిప్రమాద ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.