అక్షరటుడే, వెబ్‌డెస్క్ : El Nino Crisis | ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర రైతాంగంతో (Farmers) పాటు సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు సాగు తగ్గడంతో బియ్యం, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం ఎల్‌నినోపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో తీవ్రమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందన్నారు. జూన్ వరకు తాగు నీరు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో సరైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్య తీవ్రతరమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అయితే మార్కెట్లో విద్యుత్ అందుబాటులో లేదని తెలిపారు.
El Nino Crisis | పొదుపుగా వాడుకోవాలి
విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సీఎం సూచించారు. విద్యుత్ ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలన్నారు. కోవిడ్ (Covid) సంక్షోభంలా ఎల్‌నినోను ఎదుర్కోనేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతీ కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలన్నారు. నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నీటిని, విద్యుత్‌ను వృథా చేయొద్దని సూచించారు.
దీనిని కూడా చదవండి : Chandrayanpalli Road Accident | మూడు లారీలు, రెండు కార్లు ఢీ.. చంద్రయాణ్పల్లి వద్ద ఘటన